కార్తీక మాసాన్ని చాలా ముఖ్యమైన దానిగా అంతేకాదు చాలా పవిత్రమైన దానిగా భావిస్తూ ఉంటారు ఆ మాసంలో కొన్ని కొన్ని పనులు చేయడం వల్ల జీవితంలో కష్టాలు పోయి మంచి రోజులు వస్తాయని అందరూ భావిస్తూ ఉంటారు.ఈ కార్తీకమాసంలో వచ్చే మొదటి సోమవారాన్ని అత్యంత అత్యంత పవిత్రంగా భావిస్తూ ఉంటారు అయితే ఈ సోమవారం ఈ పనులు చేయడం వల్ల మంచి ఫలితాలు అయితే వస్తాయి అవి ఏంటో ఇప్పుడు చూద్దాం
ఉదయం చేయవలసినవి
తెల్లవారుజామునే లెగిసి గంగాజలం కలిపిన నీటితో స్నానం చేయాలి
శుభ్రంగా బట్టలు వేసుకోవాలి. తెలుపు లేదా పసుపు రంగు వస్త్రాలు మంచివి.
ఇంటి ముందు ముక్కు తలుపు దగ్గర దీపం పెట్టాలి.
తులసి చెట్టుకు దీపం పెట్టి నమస్కరించాలి.
శివ పూజ విధానం
ఇంట్లో లేదా దేవాలయంలో శివలింగానికి పాలు, నీరు, తేనెతో అభిషేకం చేయాలి.
బిల్వదళాలు (బెల్లపత్రం) సమర్పించాలి.
"ఓం నమః శివాయ" మంత్రం కనీసం 108 సార్లు జపించాలి.
శివపూజ తరువాత పార్వతీ దేవికి కూడా నమస్కరించాలి
విష్ణు మరియు తులసి పూజ
తులసి చెట్టుకు దీపం పెట్టి "ఓం నమో నారాయణాయ" మంత్రం జపించాలి.
తులసి ఆకులు దేవుడికి సమర్పించాలి.
ఉపవాసం & దానధర్మం
చాలా మంది ఈ రోజు ఉపవాసం ఉంటారు. పాలు, పండ్లు తీసుకోవచ్చు.
పేదవారికి, గోశాలకు లేదా ఆలయానికి ఆహారం లేదా నూనె దీపాలు దానం చేయడం శుభప్రదం.
సాయంత్రం
తిరిగి దీపారాధన చేయాలి.
శివుని కథలు, పౌరాణిక గాధలు వినడం లేదా చదవడం పుణ్యకరం.
కుటుంబంతో కలిసి భక్తి పాటలు పాడడం, తులసి వద్ద దీపాలు వెలిగించడం శ్రేయస్కరం.
ప్రార్థన
“శంభో శంకర భోలెనాథా, నా మనసును శాంతంగా ఉంచి, నా కుటుంబానికి ఆరోగ్యం, ఆనందం ప్రసాదించు”
అని ప్రార్ధన చేసుకోవడం ఆ శివుడు నిత్యం మీతోనే ఉంటూ మీ జీవితాన్ని మంచి మార్గంలో నడిపిస్తాడు
Tags
0 Comments