వేడెక్కిన బజ్జీ మిర్చీ ఫ్రై – భోజనానికి అదిరిపోయే రుచి

 ఇంట్లో ప్రతిరోజూ ఒకే రకం కూరలు వండుతూ ఉంటే బోర్‌గా అనిపిస్తుందా? రుచి మార్పు కోసం ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనుకుంటున్నారా? అయితే మీ కోసం ఓ సింపుల్, టేస్టీ వంటకం — బజ్జీ మిర్చీ ఫ్రై! 




“బజ్జీ మిర్చీ ఫ్రై” రుచి మాత్రం అదిరిపోతుంది — కాస్త స్పైసీగా, కరకరలాడే టెక్స్చర్‌తో భోజనానికి కొత్త రుచిని తెస్తుంది. అన్నం, చపాతీ, రొట్టె ఏదితో తిన్నా సూపర్‌గా నప్పుతుంది. ముఖ్యంగా వానాకాలం సాయంత్రం వేళలో వేడి వేడి టీతో కలిపి తింటే రుచికి మించి ఆనందం ఇంకేం ఉంటుంది! 

కావాల్సిన పదార్థాలు :


బజ్జీ మిర్చీ - 10 

శనగపిండి - ఒక కప్పు

గోధుమపిండి - రెండు స్పూన్లు

ఉప్పు - రుచికి తగినంత,

జీలకర్ర - అర స్పూన్‌

కారం - అర స్పూన్

ఆయిల్ - అర కప్పు



తయారీ విధానం :


ముందుగా పెద్దమిర్చీలను చక్కగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తడి లేకుండా ఆరబెట్టుకోవాలి.


ఆ తర్వాత చాకుతో నిలువుగా మధ్యలో గాటు పెట్టుకోవాలి.


ఇప్పుడు స్టౌపై ఓ చిన్న గిన్నె పెట్టి అందులో మూడు స్పూన్ల నూనె వేసి వేడి చేయండి. అయితే అది సన్‌ఫ్లవర్ లేదా పామాయిల్ కాకుండా, వేరు శనగ నూనె (గ్రౌట్‌నట్ ఆయిల్) అయితే ఇంకా రుచిగా ఉంటుంది — దీని వలన వేపుడు కాసింత కరకరలాడుతూ, సువాసనగా అవుతుంది.


వేడి చేసిన ఆయిల్ ను గోధుమ పిండి మిశ్రమంలో పోసేయాలి. ఇప్పుడు మరోసారి మిశ్రమం మొత్తం కలిసిపోయేలా చక్కగా మిక్స్ చేసుకోవాలి



తర్వాత కొద్దిగా నీళ్లు చిలకరిస్తూ బాగా కలపాలి. కానీ జాగ్రత్త — పిండి బజ్జీ పిండి లాగ లూజ్‌గా ఉండకూడదు. కాస్త గట్టిగా, పిడికిట్లో పట్టుకుంటే ముద్దలా అయ్యేంత స్థాయిలో ఉండాలి


ఇప్పుడు ఈ పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ గాటు పెట్టిన మిర్చీ మధ్యలో కూర్చాలి. మిర్చీలన్నీ ఇలా పిండితో కూర్చుకుని సిద్ధం చేసోవాలి.


ఆ తర్వాత స్టౌపై మూకుడు పెట్టి అందులో కప్పు నూనె పోయాలి. ఇది కూడా    వేరు శనగ నూనె  ఆయిల్ అయితేనే బాగుంటుంది.


వేడెక్కిన నూనెలో మిర్చీలను ఒక్కసారిగా కొద్దిగా చొప్పున వేసి ఫ్రై చేయాలి. ఈ సమయంలో మిర్చీలు ఒకదానితో ఒకటి అంటకుండా చూడాలి. స్టౌని మీడియం ఫ్లేమ్‌పై ఉంచి వేపడం మర్చిపోకండి.



మిర్చీలను అటూ ఇటూ తిప్పుతూ ఉండాలి. గోల్డెన్​ కలర్​లోకి మారిన తర్వాత బయటకు తీసుకోవాలి. కేవలం మూడు వాయిల్లోనే మిర్చీలన్నీ ఫ్రై అయిపోతాయి.


వీటిని వేడి వేడి అన్నం లేదా చపాతీతో, కొద్దిగా నెయ్యి కలిపి తిన్నప్పుడు రుచి నిజంగా అద్భుతంగా ఉంటుంది. ఈ మిర్చీ ఫ్రై మీ భోజనానికి కొత్త రుచిని తీసుకురుస్తుంది.


పప్పు, సాంబార్ తొ ఈ మిర్చీ ఫ్రైని తప్పకుండా ట్రై చేయండి. రుచి అద్భుతంగా ఉంటుంది, ఒక్కసారి ప్రయత్నిస్తే మళ్లీ మళ్లీ తినాల్సిన కోరిక వస్తుంది

Post a Comment

0 Comments