పూజల్లో ఎక్కువగా వినియోగించే కర్పూరాన్ని మనం రోజూ చేస్తూనే ఉంటాం. అయితే ఆ కర్పూరాన్ని దేనితో తయారు చేస్తారో తెలుసా
![]() |
| How is Camphor Made |
ప్రస్తుతం మన దేశంలో పండుగల శుభకాలం కొనసాగుతోంది. దసరా ముగిసిన వెంటనే దీపావళి, ఆ తరువాత ధన్‌తేరస్, కార్తీక దీపోత్సవం… ఇలా ఒక్కటి కాదు, అనేక పండుగలు వరుసగా వస్తున్నాయి. ఈ పండుగలన్నిటిలోనూ దేవుడికి పూజలు, హవనాలు, హారతులు ఒక భాగంగా ఉంటాయి. ఇవన్నిటిలోనూ ఒక ముఖ్యమైన పాత్ర పోషించే పదార్థం కర్పూరం
చిన్న చిన్న తెల్లటి ముక్కలాగా కనిపించే కర్పూరం… అగ్గిపుల్లతో తాకగానే వెంటనే మండిపోతుంది. వెంటనే సువాసనతో కూడిన పొగ నిండుతుంది. ఇది చూసే ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తుంది. కానీ ఎప్పుడైనా ఆలోచించారా –
కర్పూరం ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఎందుకు అంత వేగంగా మండిపోతుంది?
కర్పూరం ఎక్కడి నుంచి వస్తుంది?
మొదట కర్పూరం చెట్లపై ఉండే కాండాలలో, కొమ్మలలో పుట్టే ఒక సహజ పదార్థం. ఇది ముఖ్యంగా చైనా, జపాన్, ఇతర ఆసియా దేశాల్లో దొరుకుతుంది. చెక్కను వేడి చేసి వచ్చిన ఆవిరిని కూలబెట్టి కర్పూరాన్ని తయారు చేస్తారు. ఇది సహజంగా వచ్చే కర్పూరం.
ఇప్పుడు చాలా ప్రదేశాల్లో సింథటిక్ కర్పూరం (కృత్రిమంగా తయారుచేసే కర్పూరం) కూడా అందుబాటులో ఉంది. ఇది ఎక్కువగా మందుల తయారీకి, ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు. అయితే, పూజల్లో ఎక్కువగా సహజ కర్పూరాన్నే వాడాలి అని పెద్దలు చెబుతారు.
ఎందుకు వేగంగా మండిపోతుంది?
కర్పూరం చాలా త్వరగా ఆవిరైపోతుంది. దాంతో ఇది చిన్న మంటతోనే పూర్తిగా మండిపోతుంది.ఇంకా ఇది పూర్తిగా కాలిపోతుంది, పొడి మిగలదు. అందుకే దీనిని శుద్ధతకు చిహ్నంగా తీసుకుంటారు.
పూజల్లో ఎందుకు ఉపయోగిస్తారు?


0 Comments