AP 10th Public Exams 2026: పదో తరగతి ప్రశ్నపత్రాల్లో కీలక మార్పులు – ఫీజు చెల్లింపులు ఎప్పటి నుంచి?

 ఈసారి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ప్రశ్నపత్రంలో పలు కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ఈ మార్పుల అమలుకు అవసరమైన చర్యలు ప్రారంభించింది. ముఖ్యంగా భాషేతర విషయాలలో ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలు ఇకపై విద్యార్థుల పరిజ్ఞానం, అవగాహన, విశ్లేషణ, సృజనాత్మకత, అప్లికేషన్‌ మరియు ఎవాల్యూయేషన్‌ వంటి ఆరు ముఖ్యమైన మేధస్సు స్థాయిలను పరీక్షించేలా రూపొందించబడ్డాయి. ఈ మార్పులు విద్యార్థుల్లో సమగ్ర చింతనను పెంపొందించడమే కాకుండా, వారు విషయాన్ని ఎంతగాచి అర్థం చేసుకున్నారు, ఎలా ఉపయోగిస్తున్నారు అనే కోణాల్లో వారు ఎలా అభివృద్ధి చెందుతున్నారు అనే దానిపై స్పష్టతనిస్తాయి. మొత్తం మీద, ఈ కొత్త విధానం విద్యా ప్రమాణాలను మెరుగుపర్చే దిశగా కీలకమైన అడుగుగా భావించబడుతోంది.



ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మార్చి నెలలో ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షల ఫీజు చెల్లింపునకు అక్టోబరు 28వ తేదీ నుంచి అవకాశం కల్పించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. అలాగే, ఈసారి ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా అపార్ (APAR) ఐడీ ఉండాల్సిన అవసరం ఉన్నట్టు పేర్కొంది. అపార్ ఐడీ లేని విద్యార్థుల వివరాలను నమోదు చేసి, తగిన ప్రక్రియ పూర్తిచేయాలని సంబంధిత ప్రధానోపాధ్యాయులకు అధికారులు ఇప్పటికే సూచనలు జారీ చేశారు.



ఇంటి ముందు బొప్పాయి చెట్టు ఉందా .. అయితె ఆ సమస్య రావచ్చు..

Post a Comment

0 Comments