జామకాయ (Geuava) తినాలి ఎందుకు.ఎంత మంచిదో తెలుసా

 జామకాయ అంటే మన అందరికీ బాగా తెలిసిన పండు. బజార్‌లో, రోడ్డు పక్కన, తోటల దగ్గర... ఎక్కడ చూసినా ఇది కనిపిస్తుంది. చిన్నప్పుడు రాళ్లతో కొట్టి కింద పడేసి తిన్న రోజుల్ని గుర్తు చేస్తుంది. కానీ ఈ సాధారణంగా కనిపించే పండులో అంత బాగా ఆరోగ్యానికి ఉపయోగపడే గుణాలు ఉన్నాయనేది ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇందులో విటమిన్ C చాలా ఎక్కువగా ఉంటుంది, అది మనకు జలుబు, దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ ఇస్తుంది. అంతేకాదు, జీర్ణక్రియను మెరుగుపరచడం, రక్తపోటును నియంత్రించడం, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడం వంటి ఎన్నో ప్రయోజనాలున్నాయి. కొంతమంది దీనిని బరువు తగ్గాలనుకునేవాళ్ల diet‌లో కూడా చేర్చుకుంటారు. అంత గొప్ప పండు అయినా, మనం చాలాసార్లు దీన్ని తక్కువగా అంచనా వేస్తాం. కాబట్టి, జామకాయ తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.



#HealthyFruits

#NaturalRemedies

#ImmunityBooster

#VitaminC

#FiberRichFruit

#LowCalorieFruit

#DiabetesFriendly

#HeartHealth


జామకాయ తినే ప్రయోజనాలు:


ఆంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి:


జామకాయలో విటమిన్ C అధికంగా ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

శరీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్‌ను నిర్మూలించి క్యాన్సర్‌లను నివారించడంలో సహాయపడుతుంది.


రక్తపోటు నియంత్రణ


జామకాయలో పొటాషియం ఉండటం వలన రక్తపోటును నియంత్రించడంలో సహకరిస్తుంది.

హృదయ సంబంధిత సమస్యల నుండి రక్షణ కలుగుతుంది.

ఐరన్ మరియు ఫైబర్ అధికంగా ఉండటం వల్ల:

రక్తహీనత నివారణలో సహాయపడుతుంది.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

మలబద్ధకం తగ్గిస్తుంది.


చర్మ ఆరోగ్యం:


విటమిన్ A, C ఉండటం వల్ల చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుంది.

పిమ్పుల వంటి సమస్యలు తగ్గుతాయి.


బరువు తగ్గడం:


తక్కువ కాలొరీలు మరియు ఎక్కువ ఫైబర్ ఉన్న జామకాయ బరువు తగ్గే వారికీ మంచి ఆహారం.

పొట్ట నిండిన ఫీలింగ్ ఇస్తుంది, ఎక్కువగా తినకుండా ఉండటానికి సహాయపడుతుంది.


డయాబెటిస్ నియంత్రణ:


జామకాయలో చక్కెర స్థాయి తక్కువగా ఉండి, రక్తంలో షుగర్ లెవల్స్‌ను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.


కంటి ఆరోగ్యం:


విటమిన్ A ఉండటం వల్ల చూపును మెరుగుపరచడంలో సహకరిస్తుంది

Post a Comment

0 Comments