గోల్డ్ లోన్ తీసుకున్నారా?... బ్యాంకుల్లో కొత్త నిబంధనలు తెలుసుకొపోతే చాల కొల్పొతారు

ఇప్పటివరకు చాలామంది బంగారాన్నిపెట్టి రుణం తీసుకున్నప్పుడు వడ్డీని ఏడాది చివరిలో చెల్లించే వెసులుబాటును ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు కొన్ని బ్యాంకులు ఈ విధానాన్ని మార్చేస్తున్నాయి. ఇకపై బంగారు రుణాలపై వడ్డీని ప్రతి నెలా తప్పనిసరిగా చెల్లించాలి అనే కొత్త నిబంధనను అమలు చేయడం ప్రారంభించాయి.


Your Page Title
Gold loan




ఈ మార్పుకు కారణం ఏమిటంటే:



ఇటీవలి కాలంలో బంగారం ధరలు బాగా పెరగడంతో, కొన్ని సందర్భాల్లో రుణాలు తీసుకున్నవారు తిరిగి చెల్లించకుండా తప్పించుకోవడం ఎక్కువయ్యింది. దీనివల్ల బ్యాంకులకు నష్టం కలగడం మొదలైంది. అందుకే రుణాలపై నియంత్రణ పెంచడానికి ఈ Monthly Interest Payment విధానాన్ని తీసుకువస్తున్నారు


Your Page Title

ముఖ్యమైన విషయాలు:

ఇకపై వడ్డీని నెల నెలా చెల్లించాలి.

ఆలస్యంగా చెల్లిస్తే అదనపు ఛార్జీలు పడే అవకాశం ఉంది.

ఇప్పటికే రుణం తీసుకున్నవారికి కూడా రీన్యువల్ సమయంలో కొత్త నిబంధనలు వర్తించవచ్చు.

రుణం తీసుకునే ముందు మీరు ఎంపిక చేసే బ్యాంకు నిబంధనలను స్పష్టంగా తెలుసుకోవడం చాలా అవసరం.



వినియోగదారులకు సూచనలు:

మీకు బంగారు రుణం అవసరం అయితే, ముందుగా అన్ని షరతులు, వడ్డీ రేట్లు, చెల్లింపు విధానం గురించి తెలుసుకోండి. నెల నెలా వడ్డీ చెల్లించగలిగే సామర్థ్యం ఉందా అని ఆలోచించి ముందుకు వెళ్ళడం మంచిది. ఒక్కోసారి చిన్న మార్పులు కూడా మన ఆర్థిక ప్లాన్‌పై ప్రభావం చూపవచ్చు.


వడ్డీ కట్టకపోతే సిబిల్‌పై దెబ్బ

కొత్త నిబంధన ప్రకారం ప్రతినెలా వడ్డీ చెల్లించకపోతే దాని ప్రభావం నేరుగా కస్టమర్ సిబిల్ స్కోర్‌పై పడుతుందని బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. సిబిల్ స్కోర్ తగ్గితే భవిష్యత్తులో ఇతర ఏ లోన్లు పొందాలన్నా కష్టమవుతుంది. ఖాతాదారుడి ఆర్థిక పరిస్థితిని బట్టే ఈ నిబంధనలను అమలు చేస్తున్నామని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు.

Post a Comment

0 Comments