వేడి అన్నంలోకి ఒక గుత్తి నెయ్యితో పాటు ఈ వంకాయ పచ్చడి వేసుకుంటే, ఆ రుచి ఎన్నటికీ మరిచిపోలేరు! కూరలకి బదులుగా ఇలా పచ్చడి రూపంలో వంకాయలు ట్రై చేయండి – చాలా టేస్టీగా ఉంటుంది.
అది కూడా టమాటాలు వేసి. అద్భుతంగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకుని తింటే రుచిని జన్మలో మర్చిపోలేరు. తయారు చేయడం కూడా సులువే. మరి లేట్ చేయకుండా వంకాయ పచ్చడి ఎలా చేయాలో చూసేయండి.
కావాల్సిన పదార్థాలు:
టమాటాలు - 3
పచ్చిమిర్చి - 15
వంకాయలు - అర కిలో
నూనె - 4 టేబుల్‌స్పూన్లు
ధనియాలు - 2 టీస్పూన్లు
జీలకర్ర - 2 టీస్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర - గుప్పెడు
పసుపు - పావు టీస్పూన్
తాలింపు కోసం:
నూనె - 2 టేబుల్‌స్పూన్లు
జీలకర్ర - అర టీస్పూన్
ఆవాలు - అర టీస్పూన్
దంచిన వెల్లుల్లి రెబ్బలు - 10
ఎండుమిర్చి - 3
కరివేపాకు - 2 రెమ్మలు
తయారీ విధానం:
టమాటాలను శుభ్రంగా కడిగి మీడియం సైజ్‌లో ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే వంకాయల్లో పుచ్చులు ఉంటే తీసేసి రౌండ్ లేదా పొడుగ్గా కట్ చేసుకుని పక్కన ఉంచాలి.రౌండ్ గా ఉంటే ఇంకా మంచిది.
స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 2 టేబుల్స్పూన్ల నూనె వేసుకోవాలి. కాగిన నూనెలో ధనియాలు, జీలకర్ర వేసి వేయించాలి.
ఇవి కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసి ఓ రెండు నిమిషాలు మగ్గించాలి. అనంతరం టమాటా ముక్కలు వేసి కలిపి మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి.
అనంతరం ఫ్రై చేసిన వంకాయ ముక్కలు వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ స్టేజ్‌లో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి.
తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి.
ఇవి వేగిన తర్వాత కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి.
చివరగా గ్రైండ్ చేసిన టమాటా వంకాయ మిశ్రమం వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరి. ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చడి రెడి.


0 Comments