పాకిస్తాన్‌పై వరుసగా మూడోసారి విజయం సాధించిన టీమిండియా అదృష్టాన్ని కాదు, తన సామర్థ్యాన్ని చూపించింది. ఇంతవరకూ అంతా బాగానే సాగుతోంది. కానీ, ఆసియా కప్ టోర్నమెంట్ టీమిండియాకు కొన్ని ముఖ్యమైన పాఠాలు కూడా నేర్పింది. అవి వెంటనే గమనించి, సరిచేసుకోవడం తప్పనిసరి.
ఆసియా కప్ 2025 (Asia Cup 2025)లో టీమిండియా (Team India) ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో పాకిస్తాన్‌పై 5 వికెట్ల తేడాతో నెగ్గి ఆసియా కప్‌ను 9వసారి సొంతం చేసుకుంది. పాకిస్తాన్‌ను వరుసగా మూడోసారి ఓడించింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది
Hero Splendor Goes Electric: Full Details on the ₹45,000 Electric PRO Model
వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో టి20 ప్రపంచకప్ జరగనుంది. భారత్ వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుంది. ఈ టోర్నీలో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ లాంటి జట్లు కూడా టి20 ప్రపంచకప్ రేసులో ఉంటాయి.
ఆసియా కప్ గెలవడానికే టీమిండియా నానా అవస్థలు పడింది. ప్రత్యర్థి జట్లు బలహీనంగా ఉండటం వల్ల గెలుపు సాధ్యమైంది. కానీ అదే ఆటతీరుతో 2026 టి20 ప్రపంచకప్‌ను ఆశించాలంటే, అది భ్రమలో ఉండటమే అవుతుంది. ప్రపంచకప్ వేదికపై పోటీ తీవ్రంగా ఉంటుంది. ఆసియా కప్ ఫారమ్‌తో కప్పు గెలుచుకోవాలనుకుంటే, ఆ ఆశలను తక్షణమే కట్టిపెట్టడం బెటర్.
జట్టుకు నాయకత్వం వహిస్తున్న ఇద్దరు కీలక ఆటగాళ్లు — సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్ — ఆసియా కప్‌లో పూర్తిగా విఫలమయ్యారు. కెప్టెన్సీ భారం మోస్తూ, సూర్యకుమార్ తన బ్యాటింగ్ ఫామ్‌ను కోల్పోయినట్టే కనిపిస్తోంది. ఇక గిల్ విషయానికి వస్తే, అతడి ఎంపిక తలెత్తినప్పుడు ‘రెకమెండేషన్ కోటా’ అనేవారు కొంతమంది. కానీ ఆ ఆరోపణలను తప్పుపరచలేకపోయేలా, అతని ప్రదర్శన తక్కువ స్థాయిలోనే నిలిచిపోయింది.
శుబ్‌మన్ గిల్ ఆసియా కప్ 2025లో 7 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 127 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోరు 47. సగటు 21.16. స్ట్రయిక్ రేట్ 151. ఓపెనర్‌గా వస్తూ ఈ గణాంకాలు నమోదు చేయడం అంటే పేలవ ఆటతీరుకు నిదర్శనం. స్పిన్, బౌన్స్, లోపలకి వచ్చే బంతులను ఆడటంలో గిల్ ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు
.
Dragon Fruit Benefits: 10 Reasons to Eat This Superfruit Daily
యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్‌లు టీమిండియాలో చోటు కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి ప్లేయర్లను వదిలేసి గిల్, సూర్యకుమార్ యాదవ్‌ను కొనసాగించడం నిజంగా సిగ్గు చేటు. వచ్చే ఏడాది జరిగే టి20 ప్రపంచకప్‌లో ఛాంపియన్‌గా నిలవాలంటే సూర్యకుమార్, గిల్‌ను పక్కన పెట్టాల్సిందే.


0 Comments