డ్వాక్రా మహిళలకు సీఎం చంద్రబాబు శుభవార్త!

 ఏపీ ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం, మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడం కోసం అనేక పథకాలను అమలు చేస్తుంది. అంతేకాదు మహిళలకు కుటుంబ ఆర్థిక వ్యవహారాలలో కీలక భూమిక పోషించేలా మద్దతునిస్తుంది.మన డబ్బులు మన లెక్కలు అనే నూతన ఏఐ ఆధారిత యాప్ ను ఆవిష్కరించిన ఏపీ సర్కార్ ఈ యాప్ ద్వారా నిధుల నిర్వహణను మరింత సులభతరం చేయడానికి, ఆర్థిక అక్రమాలను అరికట్టడానికి రూపొందించింది





ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత యాప్ ప్రయోజనాలు:


పారదర్శకత: డ్వాక్రా గ్రూపుల ఆర్థిక లావాదేవీలను స్పష్టంగా ట్రాక్ చేయడంలో సహాయపడుతుంది.

ఆడిట్ ఫ్రెండ్లీ: లావాదేవీలపై స్పష్టమైన డేటా అందుబాటులో ఉండటంతో, అక్రమాలు తగ్గుతాయి.

రియల్ టైం ట్రాకింగ్: సభ్యుల ఖాతాల్లో డబ్బు జమ లేదా విత్‌డ్రా అయినా వెంటనే తెలుసుకోవచ్చు.

డేటా విశ్లేషణ: గ్రూపుల పనితీరు, అభివృద్ధి స్థాయి వంటి సమాచారం ఆధారంగా మరింత మెరుగైన నిర్ణయాలు తీసుకోవచ్చు.

డిజిటల్ చెల్లింపులకు మద్దతు: మహిళలు డిజిటల్ పేమెంట్స్‌కి అలవాటుపడి, ఆర్థిక వ్యవహారాల్లో మరింత చొరవ చూపుతారు.


డ్వాక్రా మహిళలకు కొత్త యాప్


ఈ కొత్త యాప్ ద్వారా డ్వాక్రా మహిళలు తమ బ్యాంకుఖాతా వివరాలను నేరుగా ఫోన్లో చెక్ చేసుకోవచ్చు. ఒక క్లిక్ తోనే ఖాతా స్టేట్మెంట్ వివరాలు కూడా వీరికి అందుబాటులోకి వస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పనిచేసే ఈ యాప్ మనకు ఏం వివరాలు కావాలో మౌఖిక ఆదేశాలు ఇస్తే అది సమాచారాన్ని అందిస్తుంది. 


Mango-licious: The Top 6 Health Benefits of Mangoes


రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం:


మహిళలను కుటుంబం మరియు సమాజంలో ఆర్థికంగా బలోపేతం చేయడం.

గ్రామీణ మహిళలకు టెక్నాలజీని చేరువ చేయడం.

డిజిటల్ లిటరసీ పెంచడం ద్వారా మహిళలకు స్వతంత్రత, ఆత్మవిశ్వాసం కల్పించడం.

Post a Comment

0 Comments