పేటీఎం గోల్డ్ కాయిన్స్ రివార్డ్ ప్రోగ్రామ్: రోజువారీ డిజిటల్ చెల్లింపులతో బంగారం సంపాదించండి

 పండుగ సీజన్‌ సందర్భంగా పేటీఎం సంచలనాత్మకంగా ఒక కొత్త ప్రకటన చేసింది. "గోల్డ్ కాయిన్స్" అనే వినూత్న రివార్డ్స్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా, వినియోగదారులు చేసే ప్రతి డిజిటల్ లావాదేవీపై, ట్రాన్సాక్షన్ విలువలో ఒక శాతం వరకూ గోల్డ్ కాయిన్స్ రూపంలో రివార్డ్స్ పొందవచ్చు. అంతేకాదు, చిన్న మొత్తాలను కూడా డిజిటల్ గోల్డ్‌గా మారుస్తుకునే అవకాశం కల్పించడం ఈ ప్రోగ్రామ్ ప్రత్యేకత.




ఇక్కడ సరికొత్త గోల్డ్ కాయిన్స్ రివార్డ్స్ ప్రోగ్రామ్ పేరిట దీనిని తీసుకొచ్చింది. ఇక్కడ కస్టమర్లు తాము చేసే ప్రతి డిజిటల్ ట్రాన్సాక్షన్‌పైనా .. గోల్డ్ కాయిన్స్ సంపాదించే అవకాశం ఉంటుంది. వాటిని నేరుగా డిజిటల్ గోల్డ్‌గా మార్చుకోవచ్చు. అంటే బంగారంపై పెట్టుబడి అవుతుందన్నమాట.


airtel తక్కువ ధర రీఛార్జ్ ప్లాన్లు 2025 – కాల్స్ & డేటా కోసం బెస్ట్ ఆఫర్లు

సాధారణంగా రివార్డ్స్ అనేవి క్యాష్‌బ్యాక్ లేదా కూపన్ల లో ఉంటాయి. చాలామందికి ఇదే గా ఉంటుంది. కానీ పేటీఎం కొత్తగా తీసుకొచ్చిన స్కీమ్ మాత్రం కొంచెం వేరుగా ఉంది. ఇక్కడ మీరు ప్రతిరోజూ చేసే ఖర్చులకు డిజిటల్ చెల్లింపులు చేయడం వల్ల, తిరిగి కొంత ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది.

ఇది ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి తోడ్పడుతుంది. అలాగే డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తుంది.

Post a Comment

0 Comments