వర్షాకాలం లేదా చలికాలం రాగానే ఇంటి చుట్టూ కీటకాల కలవరం ఎక్కువవుతుంది. సాయంత్రం పడితే తలుపులు, కిటికీలు బాగా మూసుకున్నా, అవి ఏదోలా లోపలికి వచ్చేస్తూనే ఉంటాయి. లైట్స్ ఆన్ చేసిన వెంటనే చిన్న చిన్న చిమ్మటలు, పురుగులు వాటి వెలుగుకి ఆకర్షితులై గుంపులుగా తిరుగుతుంటాయి. కొన్నిసార్లు ఆహారంలో పడిపోవడం వల్ల ఆరోగ్యానికి హానికరంగా మారుతాయి. అంతేకాదు, ఇంటి వాతావరణాన్ని కూడా అసౌకర్యంగా మార్చేస్తాయి.
ఈ పురుగుల్ని నివారించేందుకు స్ప్రేలు, రసాయన మందులు వాడినప్పటికీ సమస్య పూర్తిగా తగ్గదని అనేక మంది అనుభవంతో చెబుతున్నారు. పైగా, ఈ కెమికల్ వాసనలు పిల్లలు, వృద్ధులు, పెంపుడు జంతువులకు అసౌకర్యం కలిగించే అవకాశముంది. ఇలాంటి పరిస్థితుల్లో హానికరం కాని ఇంటి చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు దక్కుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సహజ పరిష్కారాల్లో కర్పూరం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని వారు చెబుతున్నారు.
కర్పూరం వాడకం మన ఇంటి ఉపయోగాల్లో చాలా కాలంగా ఒక భాగంగా ఉంది. పూజల్లోనే కాదు, దాన్ని ఇతర అవసరాలకు కూడా ఉపయోగిస్తుంటారు. కర్పూరానికి సహజంగా క్రిములను దూరం చేసే లక్షణాలు ఉంటాయి. దీని వాసనను చాలా పురుగులు, కీటకాలు సహించలేవు. కాబట్టి కర్పూరాన్ని సరైన విధంగా ఉపయోగిస్తే, ఇంట్లో ఉండే ఈ చిన్న పురుగుల సమస్యకు పరిష్కారం చూపించవచ్చు.
ఘుమఘుమలాడే "వంకాయ పచ్చడి" - ఇంట్లో తక్కువ టైంలో | స్పైసీ వంకాయ టమాటా చట్నీ తయారీ విధానం -SPICY VANKAYA PACHADI
కర్పూరాన్ని వాడే విధానం కూడా చాలా సులభం. మొదట కర్పూరాన్ని పొడి చేయాలి. ఆ పొడిని కొద్దిగా నీటిలో కలిపి స్ప్రే బాటిల్‌లో పోయాలి. ఈ మిశ్రమాన్ని కీటకాలు ఎక్కువగా కనిపించే ప్రదేశాల్లో — లైట్లు, మూలలు, వంటగదిలోని క్యాబినెట్ల చుట్టూ — పిచికారీ చేయాలి. కర్పూరం వాసన వచ్చిన వెంటనే పురుగులు అక్కడి నుంచి పారిపోతాయి. అంతేకాదు, ఈ వాసన ఇంట్లో ఒక తీపి, స్వచ్చమైన వాతావరణాన్ని తీసుకువస్తుంది. ఫ్రెష్‌గా, శుభ్రంగా ఉండే అనుభూతిని కలిగిస్తుంది.


0 Comments